Bharath September 2, 2026prabhanews.com
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు 'OG' టీమ్ ఆయన పుట్టిన రోజు సందర్బంగా సర్ ప్రైజ్ ఇచ్చింది.
దర్శకుడు సుజీత్ 'OG' సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూనే.. ఇకపై మొదలయ్యే కొత్త ప్రయాణంపై ఓ ఆసక్తికర వీడియోనే విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పారు.
ఈ పోస్ట్ లో "From the #OGUniverse To the #OG" అంటూ మొదలుపెట్టిన సుజీత్.. ఇప్పటివరకు జరిగిన ప్రతిదానికీ, ఇక నుంచి ప్రారంభం కానున్న ప్రతిదానికీ తన ప్రేమ ఉంటుందని పోస్ట్ లో పేర్కొన్నారు.
'OG' యూనివర్స్
పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా 'OG' నుంచి అభిమానులకు ఓ ప్రత్యేకమైన ట్రీట్ రాబోతున్నట్లు ఇప్పటికే ఆసక్తి నెలకొంది. దీంతో సుజీత్ పోస్ట్ మరింత హైప్ పెంచింది. 'OG' యూనివర్స్ ఎలా ఉండబోతుంది..? ఇందులో కొత్తగా వచ్చే క్యారెక్టర్స్ ఏంటి..? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'OG'పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్‌ను సుజీత్ ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతోంది. తాజాగా దర్శకుడి బర్త్‌డే పోస్ట్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి.
