Rama Rao September 1, 2026Telangana
కడెం, ఆంధ్రప్రభ: ఇటీవల నూతనంగా ఎన్నికైన పీఆర్‌టీయూ-టీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బీవీ రమణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట నరేంద్రబాబులను పీఆర్‌టీయూ కడెం మండల నాయకులు ఘనంగా సన్మానించారు.
కడెం మండల అధ్యక్షుడు బొమ్మిడి మహేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి బి. వెంకటరమణతో పాటు మండల నాయకులు వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
