Dailyhunt
పోలవరం ప్రాజెక్టుకు రూ.745.94 కోట్లు విడుదల

పోలవరం ప్రాజెక్టుకు రూ.745.94 కోట్లు విడుదల

పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా చూడటంతో పాటు మరింత వేగవంతం చేయడానికి రూ.745.94 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులకు 2021-22 బడ్జెట్‌లో త్రైమాసిక ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గోదావరికి వరదలు వచ్చేలోగా చేయాల్సిన పనులను శరవేగంగా పూర్తి చేయడం కోసం నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. నిర్వాసితులకు వీలైనంత వేగంగా పునరావాసం కల్పించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే నిధులు విడుదల చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News