Saturday, 23 Jan, 12.00 am ప్రభన్యూస్

ముఖ్యాంశాలు
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో మరో సొరంగాన్ని కనుగొన్న బీఎస్ఎఫ్

జమ్మూకాశ్మీర్ లో పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లు ఈ రోజు మరోర సొరంగాన్ని కనుగొన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని కతువా జిల్లాలో ఈ ఉదయం బీఎస్ఎఫ్ జవాన్లు మరో సొరంగాన్ని కనుగోన్నారు. పది రోజుల వ్యవధిలో బీఎస్ఎఫ్ కనుగొనన్న రెండో సొరంగం ఇది. ఇలాంటి సొరంగాలనే పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు దేశంలోకి చొరబడేందుకు ఉపయోగిస్తున్నాయి. బీఎస్ఓఫ్ ప్రతినిథి కథనం ప్రకారం ఈ సొరంగాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు బారత్ లోకి చొరబడేందుకు నిర్మించింది. బీఎస్ఎఫ్ జవాన్ల యాంటీ టన్నలింగ్ ఆపరేషన్ లో భాగంగా హరినగర్ సెక్టార్ లోని పన్సార్ ప్రాంతంలో సరిహద్దు చెక్ పోస్టు సమీపంలో ఈ సొరంగం బయటపడిందని ఆ ప్రతినిథి తెలిపారు. ఈ సొరంగం దాదాపు 30 అడుగుల లోతు, 150 మీటర్ల పొడవు ఉందని వివరించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Prabha News
Top