Rama Rao September 1, 2026pakistan
సింధు జలాల విషయంలో భారత్ కీలక నిర్ణయం
హేగ్ కోర్టు తీర్పును భారత్ ఎందుకు తిరస్కరించింది?
పాకిస్తాన్ ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయి?
సార్వభౌమాధికారంపై భారత్ స్పష్టమైన వైఖరి
ఉగ్రవాదం ఆగే వరకూ వైఖరి మారదన్న భారత్
సింధు జలాల కోసం పాకిస్తాన్ చేసిన మరో ప్రయత్నం విఫల మైంది. హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఒప్పందంపై ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. సర్వసత్తాక ప్రతిపత్తిగల భారత్ కు తన దేశప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ ఒప్పం దం రద్దు చేసేందుకు హక్కు ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం
చేసింది. సిందు నదీ జలాలను ఇరుదేశాలు పంచుకోవాలంటూ మధ్యవర్తిత్వ కోర్టు చేసిన సిఫార్సును భారత్ తోసిపుచ్చింది. సిందు జలాలపై పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళి భంగ పడింది. ప్రపంచ ఒప్పందం నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించి ఏర్పాటు చేసిన మధ్యవర్తి పరిష్కారం కోర్టుపూర్తిగా చట్ట విరుద్ధమై నదని భారత్ స్పష్టం చేసింది. పహల్గావ్ పర్యాటకులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనకు ప్రతీకారంగా పాకి స్తానికి బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ ఎన్నో సార్లు భారత్కు విజ్ఞప్తులు చేసింది. రాయబారాలను నెరిపింది. చివరగా, హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి దరఖాస్తు చేసింది. అంతర్జాతీ యంగా ఎన్నో వేదికలపై భారత్ని యాగీ చేసింది. సార్వభౌమాధి కారం కలిగిన దేశంగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై సమీక్షించే, లేదే చర్చించే అధికారం ఏ దేశానికీ లేదా, న్యాయస్థానానికి లేదని భారత్ స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడాన్నీ, ఆ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తిరస్క రించే హక్కు భారతికి ఉందని అంతర్జాతీయ న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ వ్యవహారాన్ని ఇంకా సాగదీయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన కోర్టు ఆఫ్ ఆర్ బ్రిట్రేషన్ను న్యాయబద్ధమైన సంస్థగా భారత్ ఎన్నడూ గుర్తించలే దని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ సంస్థ నిర్వహించిన విచా రణకు భారత్ ఎన్నడూ హాజరు కాలేదనీ, అటువంటప్పుడు ఆ సంస్థ ఇచ్చే తీర్పునకు ఎలా కట్టుబడి ఉంటుందని భారత్ ప్రశ్నించింది. భారత్ సార్వభౌమాధికారాల్లో జోక్యం చేసుకునే హక్కు కోర్టు ఆఫ్ ఆర్ట్రేషన్కు ఎంత మాత్రం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి స్వస్తి చెప్పే వరకూ ఆ దేశంతో భారత్ వైఖరి మారబోదని భారత్ స్పష్టం చేసింది.
