Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం

తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం

Nagamani Malligari August 1, 2026prabhanews.com

తల్లిపాలే శిశువుకు తొలి టీకా..

అచ్చంపేటలో తల్లిపాల వారోత్సవాలు

చ్చంపేట, ఆంధ్రప్రభ: శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలే తొలి రక్షణ కవచమని అంగన్‌వాడీ సూపర్వైజర్ సువర్ణ అన్నారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శనివారం అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని 10వ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సూపర్వైజర్ సువర్ణ గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డబ్బా పాల కంటే తల్లిపాలే శిశువులకు అత్యంత శ్రేయస్కరమని, బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. తల్లిపాలలో సమృద్ధిగా ఉండే పోషకాలు శిశువుకు అవసరమైన పోషణను అందించడమే కాకుండా, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని వివరించారు.

అనంతరం 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు గుడ్లు, బాలామృతం, ఇతర పౌష్టికాహార పదార్థాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో హబ్బు వెంకటమ్మ, అంగన్‌వాడీ టీచర్ సంధ్య, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News