Bharath August 28, 2026prabhanews.com
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
రక్షాబంధన్ సందర్భంగా సీఎంకు రాఖీ కట్టేందుకు కొంత సమయం కేటాయించాలని ఆమె కోరినట్లు సమాచారం. ఇటీవల కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతున్న వేళ.. రాఖీ పండుగ సందర్భంగా సీఎం అపాయింట్‌మెంట్ కోరడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, కొండా సురేఖ మధ్య జరిగే సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గతంలో ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు, తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే.. రాఖీ సందర్భంగా జరిగే భేటీకి ప్రాధాన్యం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
