Dailyhunt
Viswambara | తెర వెనుక ఏం జరగుతోంది..?

Viswambara | తెర వెనుక ఏం జరగుతోంది..?

Praneeth Kumar April 6, 2026Chiranjeevi upcoming movie, Chiranjeevi Vishwambhara, Mega Star Chiranjeevi movie, prabhanews.com, Telugu Cinema News, Tollywood news, Vishwambhara delay, Vishwambhara latest news, Vishwambhara Movie, Vishwambhara Release Date, Vishwambhara release rumours, Vishwambhara update, Vishwambhara VFX

Viswambara | తెర వెనుక ఏం జరగుతోంది..?

Viswambara | విశ్వంభరపై అప్ డేట్ లేకపోవడం
సమ్మర్ రిలీజ్ ప్లాన్ ఏమైంది?
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అడ్వాంటేజ్ వినియోగించుకోవాలా?
జులై రిలీజ్ పై పెరుగుతున్న అనుమానాలు
మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిన సమయం

Viswambara | ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విశ్వంభర మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు రిలీజ్ కాలేదు. సమ్మర్ లో రిలీజ్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు కానీ.. ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడేమో అసలు ఎప్పటికైనా వస్తుందా..? రాదా..? అంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి ఉన్నాయి. మేకర్స్ ఏమో.. విశ్వంభర మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..?

Viswambara | ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు..

విశ్వంభర మూవీ గత సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ.. రిలీజ్ కాలేదు. మన శంకర్ వర ప్రసాద్ గారు మూవీని ఈ సంక్రాంతికి రిలీజ్ చేసిన తర్వాత సమ్మర్ లో విశ్వంభర మూవీని విడుదల చేస్తామని.. సమ్మర్ లో పిల్లలకు హాలీడేస్ కాబట్టి.. అప్పుడు రిలీజ్ (Release) చేయడం కరెక్ట్ గా ఉంటుందని.. ఇది పిల్లలకు బాగా నచ్చే సినిమా అని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఆమధ్య ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే.. ఆతర్వాత నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఉగాదికి అప్ డేట్ వస్తుంది అనుకుంటే.. రాలేదు. శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి.. ఇలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కానీ.. విశ్వంభర అప్ డేట్ మాత్రం రావడం లేదు..

Viswambara | అడ్వాంటేజ్ ఉపయోగించుకోవాలి కానీ..

సినిమా ఆలస్యం అయితే.. జనాల్లో హైప్ తగ్గిపోతుంటుంది. ఇన్నాళ్లు తీసారనే సింపతి కంటే.. కంటెంట్ బాగా రాలేదు కాబట్టే పక్కనపెట్టేసారు అనుకుంటారు. మన శంకర్ వరప్రసాద్ గారు (Mana Shankar Varaprasad Garu) సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకోవాలి కానీ.. అలా చేయకపోవడం చూస్తుంటే.. విశ్వంభర కంటెంట్ పై అనుమానాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ నుంచి ఏదోక కంటెంట్ రిలీజ్ చేస్తే.. సోషల్ మీడియాలో జనాలు మాట్లాకుంటారు. సినిమా పై బజ్ ఉంటుంది. అలా చేయకపోతే.. జనాలు మరచిపోతారు.

Viswambara | జులైలో కూడా రావడం లేదా..?

వీఎఫ్ఎక్స్ వలన ఇంత టైమ్ తీసుకోవడం ఓకే కానీ.. మరీ లేట్ ఎక్కువ అవ్వడం మంచిది కాదు. సమ్మర్ లో వచ్చే సినిమాలు ఆల్రెడీ డేట్ లాక్ చేసుకున్నాయి. సమ్మర్ తర్వాత వచ్చే సినిమాలు (Movies) కూడా రెడీ అవుతున్నాయి. ఈ సినిమాని జులైలో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు జులైలో కూడా విశ్వంభర రావడం లేదు అని టాక్ బలంగా వినిపిస్తోంది. అంతే కాకుండా.. అసలు విశ్వంభర వస్తుందా..? రాదా అనే అనుమానాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా.. విశ్వంభర మేకర్స్ అప్ డేట్ ఇస్తే మంచిది. మరి.. త్వరలో విశ్వంభర రిలీజ్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News