శ్రీకాకుళం : అరబిందో ఫార్మా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం పైడిభీమవరంలోని అరబిందో కార్మికులు చేపట్టిన సత్యాగ్రహం శనివారానికి 6 వ రోజుకు చేరుకుంది. అరబిందో యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.