Dailyhunt
12వ రోజు కొనసాగిన జిజిహెచ్‌ ఆర్‌ఎంసి సెక్యూరిటీ గార్డ్స్‌ రిలే నిరాహారదీక్ష

12వ రోజు కొనసాగిన జిజిహెచ్‌ ఆర్‌ఎంసి సెక్యూరిటీ గార్డ్స్‌ రిలే నిరాహారదీక్ష

.ఆర్‌ఎంసి సెక్యూరిటీ గార్డ్స్‌ కి తక్షణమే ఫిబ్రవరి నెల జీతాలు చెల్లించాలి

ప్రజాశక్తి కాకినాడ : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ సేవలందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు పెంచాలని, క్యాజువల్‌ లీవులు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన గార్డ్స్‌ ని డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిజిహెచ్‌ సెక్యూరిటీ కార్యాలయం వద్ద మార్చి 25 న ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు 12 వ రోజైన ఆదివారం కూడా నిర్వహించారు.

సిఐటియు నగర కో కన్వీనర్‌ పలివెల వీరబాబు దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిజిహెచ్‌ లో సెక్యూరిటీ గార్డ్స్‌ కి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వీడి సెక్యూరిటీ గార్డ్స్‌ తో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ యాజమాన్యం దిగి వచ్చేవరకు ఆందోళన కొనసాగించాలన్నారు. ఆర్‌ఎంసి సెక్యూరిటీ గార్డ్స్‌ కి తక్షణమే ఫిబ్రవరి నెల జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు సంస్థ స్థానిక ఇంచార్జ్‌ స్పందన లేదు కాబట్టి కాంట్రాక్టర్‌ ని రప్పించాల్సిన బాధ్యత జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ వారిదేనన్నారు. 12వ రోజు దీక్షల్లో సెక్యూరిటీ గార్డ్స్‌ లంకే ధర్మ, కె. భాగ్యలక్ష్మి, శేరు దుర్గ, పోతుల దేవి, ఎస్‌. శివగంగ లు కూర్చున్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్‌ మలక వెంకటరమణతో పాటు చెక్కా ధర్మారావు, అప్పన్న, బాలరాజు, శ్రీనివాస్‌, రమణ, దుర్గా ప్రసాద్‌, సోమరాజు, ఆదినారాయణ, దీపక్‌ , కోటేశ్వరరావు , విజయ , రామకష్ణ, భాస్కరరావు, షఫీ ఖాన్‌, చిలకమ్మా, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti