Dailyhunt
15న 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' విడుదల

15న 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' విడుదల

త్రిగుణ్‌, పాయల్‌ రాధాకృష్ణ, అనీష్‌ కురు విల్లా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌'. మధుదీప్‌ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరవింద్‌ మండ్యం లోటస్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నిర్మించారు.

సిహెచ్‌విఎస్‌ఎన్‌ బాబ్జీ సమర్పిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్‌, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్‌ విడుదల తేదీని ప్రకటిం చారు. ఈనెల 15న ఈ సినిమా శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్‌, ముత్యాల రాందాస్‌ డిస్ట్రి బ్యూషన్‌లో థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యూచర్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో పాటు, ఒక అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ హృద్యమైన కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది అని చిత్రయూనిట్‌ తెలిపింది. శివాజీ రాజా, హర్ష వర్ధన్‌, సత్య కృష్ణన్‌, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్‌, సివిఎల్‌ నర్సింహారావు, గుండు సుదర్శన్‌, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్‌, సరయు, సత్తిపండు ముఖ్య పాత్రలు పోషించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti