Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
20 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌!

20 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌!

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశాల తొలి దశ కౌన్సెలింగ్‌ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. ఇఎపిసెట్‌ అడ్మిషన్ల కమిటీ సమావేశం బుధవారం జరిగింది.

కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేయాలని నిర్ణయించారు. 20 నుంచి 29వ తేదీ వరకు రిజిస్ర్టేషన్‌, నగదు చెల్లింపులకు అవకాశం ఉంటుంది. 22 నుంచి 31వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 25 నుంచి 31వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఆప్షన్లు మార్చుకునేందుకు ఆగస్టు ఒకటిన అవకాశం ఉంది. 6న సీట్ల కేటాయింపు ఉంటుంది. 7 నుంచి 13వ తేదీలోపు కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు కళాశాలలకు సంబంధించిన ఫీజుల నిర్ధారణ పూర్తికాలేదు. ఆప్షన్లు ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి ఎపి ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ ఈ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారమే కొత్త కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. రిటైర్డు హైకోర్టు జడ్జి విఆర్‌కె కృపాసాగర్‌ను ఛైర్మన్‌గా నియమించింది. అయితే ఈ కమిటీ 24వ తేదీలోపు ఫీజులను నిర్ధారించాల్సి ఉంటుంది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti