Friday, 18 Oct, 11.12 pm ప్రజాశక్తి

అనంతపురం
23న చెకుముకి ట్యాలెంట్‌ టెస్ట్‌

ప్రజాశక్తి-హిందూపురం
ఈ నెల 23న జెవివి ఆధ్వర్యంలో చెకుముకి ట్యాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు ఆసంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రామక్రిష్ణ, డాక్టర్‌ ఇటి రామ్మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ట్యాలెంట్‌ టెస్ట్‌కు సంబంధించిన గోడపత్రికలను పీపుల్స్‌ క్లీనిక్‌ ఆధ్వర్యంలో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ ధృక్ఫథం పెంపొందించడానికి సైన్స్‌ పట్ల ఆసక్తిని కలిగించడానికి వారిలో వున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి మూఢనమ్మకాలను అరికట్టాడానికి జెవివి నిరంతరం కృషిచేస్తుందన్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు ట్యాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నామన్నారు. హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి, పరిగిలో వున్న అన్ని ఉన్నత పాఠశాలలోని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 23న పాఠశాల స్థాయిలో చెకుముకి ట్యాలెంట్‌ టెస్ట్‌ను నిర్వహిస్తునానమని చెప్పారు. ఈకార్యక్రమంలో జెవివి నాయకులు అలావుల్లా, అబ్దుల్‌ హక్‌ ప్రమీళ, రవీంద్రనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti

related stories

Top