చెన్నై : తమిళనాడులో ఏప్రిల్ 23 ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం బిజెపి 27 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ చోటు దక్కించుకున్నారు.
సౌందరరాజన్ మైలపోర్ నుంచి పోటీకి బరిలో దిగనున్నారు. ఇక ఎల్ మురుగన్, అవనాష్టి స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు బిజెపి వెల్లడించింది. ఎన్‌డిఎ కూటమిలో భాగంగా బిజెపి 27 స్థానాలు, ఏఐఎడిఎంకె 169 స్థానాలు, అన్బుమణి రామదాస్ ఆధ్వర్యంలో పిఎంకె పార్టీ 18, టిటివి దినకరన్ స్థాపించిన ఏఎంఎంకె పార్టీ 11 స్థానాల్లో పోటీ చేయనుంది.

