శ్రీకాకుళం : అరబిందో కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలంటూ.. సిఐటియు ఆధ్వర్యంలో పైడిభీమవరంలో అరబిందో కార్మికులు చేపట్టిన సత్యాగ్రహ దీక్షలు గురువారంతో 4 వ రోజుకు చేరుకున్నాయి. అరబిందో ఫార్మా పరిశ్రమలో అక్రమంగా విధులలో నుండి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని సిఐటియు నేతలు, కార్మికులు డిమాండ్ చేశారు.

