Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆధార్‌ 'కొత్త రూపు' కథనాలు నిరాధారం : పిఐబి వెల్లడి

ఆధార్‌ 'కొత్త రూపు' కథనాలు నిరాధారం : పిఐబి వెల్లడి

న్యూఢిల్లీ : ఆధార్‌ కార్డుపై ఇక మీదట పేర్లు, చిరునామా లేకుండా కేవలం ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ మాత్రమే ఉంటాయంటూ వస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు భారత సమాచార, ప్రసారాల శాఖ (పిఐబి) ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 'న్యూ లుక్‌తో ఆధార్‌' అంటూ వస్తున్న వార్తలు నిరాధారం. ఈ కథనాలు నిజం కాదు. అలాంటి మార్పులతో కొత్త కార్డు తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ లేదు' అని పిఐబి తెలిపింది. ఇలాంటి కథనాలను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను ప్రజలు నమ్మరాదని పిలుపుని చ్చింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి పోస్టులు ప్రజల్లో అనవసరమైన అయోమయాన్ని సృష్టిస్తున్నందున ఈ వివరణ ఇస్తున్నట్లు పేర్కొంది. ఆధార్‌కు సంబంధించిన ఏ విధమైన సమాచారం అయినా ఆధార్‌ అధీకృత సంస్థ అయిన యుఐడిఎఐ అధికార ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లోని యుఐడిఎఐ అధికారిక వైరిఫైడ్డ్‌ ఖాతాలలో పోస్టు చేసే సమాచారం తప్పితే ఏ ఇతర సమాచారాన్ని ప్రజలు నమ్మరాదని సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti