ఆఫ్ఘనిస్థాన్‌తో జూన్ 6 నుంచి జరగబోయే ఏకైక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ రెండు ఫార్మాట్లకు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా..
టెస్టు జట్టుకు కేఎల్ రాహుల్, వన్డే జట్టుకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులో చోటు దక్కించుకోగా, రోహిత్, హార్దిక్ పాండ్యాల ఎంపిక వారి ఫిట్‌నెస్ ఆధారంగానే ఖరారు కానుంది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి లభించగా.. ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ రెండు జట్లకు ఎంపికయ్యారు. అలాగే వన్డే జట్టులోకి ప్రిన్స్ యాదవ్, టెస్ట్ జట్టులోకి మానవ్ సుతార్ కొత్తగా అరంగేట్రం చేయనున్నారు.
వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ (ఫిట్‌నెస్ ఆధారంగా), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా (ఫిట్‌నెస్ ఆధారంగా), ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, గుర్నూర్ బ్రార్
టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్

