జిల్లాలో మరో 359 మందికి కరోనా
677కు చేరిన మృతులు
గుంటూరులో 65 మందికి నిర్ధారణ
68481 పెరిగిన పాజిటివ్ కేసులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం 359 మందికి కరోనా నిర్ధారణ అయింది. జిల్లాలో ఇప్పటి వరకూ 6.85 లక్షల మందికి పరీక్షలు చేయగా 68,481 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే జిల్లాలో మృతుల సంఖ్య 677 పెరిగాయి గుంటూరులో 65 మందికి కరోనా వైరస్ వ్యాప్తి జరిగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ 447 మంది కోలుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 68,481 మందికి వైరస్ నిర్ధారణ కాగా 677 మంది మృతి చెందారు. ఇంకా 62,373 మంది కోలుకున్నారు.
జిల్లాలో గురువారం నమోదు అయిన వివరాలు
అమరావతి 2,అచ్చంపేట 2, గుంటూరు రూరల్ 1, క్రోసూరు 3, మంగళగిరి 10, మేడికొండూరు 3, ముప్పాళ్ల 2, పెదకాకాని 5, పెదకూర పాడు 2, పెదనందిపాడు 1,పత్తిపాడు 10,రాజుపాలెం 1, సత్తెనపల్లి 5, తాడికొండ 11,తాడేపల్లి 5,తుళ్లూరు 5, వట్టిచెరుకూరు 13,గుంటూరు కార్పొరేషన్ 65, దాచేపల్లి 4,కారంపూడి 9, మాచవరం 1, మాచర్ల 10, పిడుగురాళ్ల 8,రెంటచింతల 7,వెల్దుర్తి 3, చిలకలూరిపేట 3,యడ్లపాడు 6,ఈపూరు 4,నాదెండ్ల 1, నర్సరావుపేట 2,నూజెండ్ల 1, నకరికల్లు 7,వినుకొండ 3, అమృతలూరు 8,బాపట్ల 15, చేబ్రోలు 4, చెరుకుపల్లి 9, దుగ్గిరాల 13, కాకు మాను 2, కర్లపాలెం 3,కొల్లిపర 4,కొల్లూరు 1, నగరం 1, నిజాంపట్నం 6, పివిపాలెం 1, పొన్నూరు 7,రేపల్లె 16,తెనాలి 41, చుండూరు 4, వేమూరు 5
గుంటూరులో కేసుల వివరాలు : బ్రాడీపేట 4, ఆనందపేట 2,అరండల్‌పేట 2, ఆర్‌టిసి కాలనీ 3, రెడ్డిపాలెం 3, చంద్రమౌళీనగర్ 2, రాజీవ్‌గాంధీనగర్ 2, పాతగుంటూరు 3, కృష్ణనగర్ 3, అమరావతి రోడ్డు 2, రాజేంద్రనగర్ 3, విద్యా నగర్ 2, ఇతరులు 8, ఒక్క కేసు నమోదు అయిన ప్రాంతాలు 26 ఉన్నాయి.
అవగాహనా ర్యాలీలు : జిల్లాలో కరోనా అవగాహన ర్యాలీలు మాచర్ల, చిలకలూరిపేట, తాడేపల్లి, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో నిర్వహించారు.

