Wednesday, 22 May, 7.14 am ప్రజాశక్తి

తాజావార్తలు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు

తిరుపతి : ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటన బుధవారం తెల్లవారుజామున సి.మల్లవరం సమీపంలో చోటు చేసుకుంది. విజయవాడ నుండి బెంగుళూరుకు వెళుతున్న బస్సు సి.మల్లవరం సమీపంలో పూతలపట్టుునాయుడు పేట రహదారి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మందికి పైగా ప్రయాణీకులకు గాయాలవ్వగా, వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి ఎంఆర్‌ పల్లి పోలీసులు చేరుకున్నారు. బస్సు డ్రైవర్‌ కునుకు తీయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top