Dailyhunt
ఆలమూరు అడిషనల్‌ ఎస్సైగా సూర్యచంద్రరావు

ఆలమూరు అడిషనల్‌ ఎస్సైగా సూర్యచంద్రరావు

ప్రజాశక్తి - ఆలమూరు : స్థానిక పోలీస్‌ స్టేషన్‌ అడిషనల్‌ ఎస్సైగా డి.సూర్యచంద్రరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సుదీర్ఘ కాలం పాటు ఆలమూరులో ఏఎస్‌ఐగా పనిచేసి పదోన్నతి పై పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎస్సైగా బదిలీ అయ్యారు.

అక్కడ నుంచి కోనసీమ జిల్లాకు కేటాయించడంతో సూర్యచంద్రరావును ఆలమూరు అడిషనల్‌ ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈమేరకు బాధ్యతలు స్వీకరించారు. ఆలమూరు అడిషనల్‌ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సూర్యచంద్రరావును రావులపాలెం రూరల్‌ సిఐ సిహెచ్‌.విద్యాసాగర్‌, ఆలమూరు ఎస్సై జి.నరేష్‌ తో పాటు పలువురు సిబ్బంది అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti