Dailyhunt
ఆంధ్రాకు సినీ పరిశ్రమ : మధుమోహనకృష్ణ

ఆంధ్రాకు సినీ పరిశ్రమ : మధుమోహనకృష్ణ

తెలంగాణా నుంచి టాలీవుడ్ ఆంధ్రాకు తరలి వస్తుందనీ, ఆ దిశగా తమ కృషిని కొనసాగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు అంబటి మధుమోహన కృష్ణ అన్నారు.

స్వీటీ మూవీస్ బ్యానర్ పై యేలెం సాయికృష్ణ, నీలిమ జోడీగా నటిస్తున్న సినిమా 'ప్రజెంట్ ట్రెండ్`. రాజధాని అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్ లోని ఆలయంలో క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించారు. యర్రంశెట్టి రాము, కృష్ణంరాజు, పద్మతోపాటుగా మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన మధుమోహనకృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు తీసుకోవటానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా పరి శ్రమ కోసం పనిచేస్తున్నారన్నారు. చాంబర్ తరపున తాము కూడా రాష్ట్రప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. 'ప్రజెంట్ ట్రండ్ ` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలవాలని ఆకాంక్షించారు. దర్శకుడు గోపిరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ, యువతను సన్మార్గంలోకి నడిపించేలా ఈ సినిమా ఉంటుందని, ప్రతిఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti