Dailyhunt
ఆప్‌ బెదిరింపులు.. ముర్ముని కలిసిన చద్దాతోపాటు పలువురు ఎంపీలు

ఆప్‌ బెదిరింపులు.. ముర్ముని కలిసిన చద్దాతోపాటు పలువురు ఎంపీలు

న్యూఢిల్లీ : ఎంపి రాఘవ్‌ చద్దాతోపాటు, అశోక్‌ కుమార్‌ మిట్టల్‌, సందీప్‌పాఠక్‌లతోపాటు పలువురు ఎంపీలు ఆప్‌ పార్టీ నుంచి బిజెపిలో విలీనమయ్యారు. దీంతో ఆప్‌ ఆగ్రహానికి గురైంది.

ఏడుగురు ఎంపీల్లో ఆరుగురు పంజాబ్‌కి చెందినవారే. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఆప్‌ ప్రభుత్వం వుంది. ఈ నేపథ్యంలో పంబ్‌లోని భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం బిజెపిలో విలీనమైన ఈ ఎంపీలపై వేటు వేయాలని ప్రయత్నించింది. అప్పటికి కుదరకపోతే నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేస్తోంది.

ఇటీవల అశోక్‌ మిట్టల్‌పై పంజాబ్‌ ప్రభుత్వం బెయిల్‌ పొందలేని సెక్షన్లకింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నెక్ట్స్‌ టార్గెట్‌ రాఘవ చద్దా అనే విశ్వసనీయ వర్గాల సమాచారం రావడంతో.. చద్దా భయాందోళనలకు గురయ్యారు. దీంతో మంగళవారం రాఘవ్ చద్దా, అశోక్‌ మిట్టల్‌, సందీప్‌ పాఠక్‌లు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.

తమకు రక్షణ కల్పించమని ముర్ముని కోరారు. వీరి అభ్యర్థనని ముర్ము అంగీకరించారు. తమకు రక్షణ కల్పించి.. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చారని చద్దా రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti