Dailyhunt
ఆరోగ్యంపై అవగాహనా ర్యాలీ

ఆరోగ్యంపై అవగాహనా ర్యాలీ

ప్రజాశక్తి-విజయనగరంకోట : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఆరోగ్యంపై అవగాహన ర్యాలీని డిఎంహెచ్‌ఒ ఎస్‌.జీవనరాణి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'విజ్ఞానానికి అండగా నిలుద్దాం- ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దాం' అనే థీమ్‌తో ఈర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ పోషకాహారం తీసుకుంటూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య తనిఖీలు చేయించుకుంటూ లైఫ్‌ స్టైల్‌ మార్చుకోవాలని సూచించారు. ప్రతిరోజూ వ్యాయామం, సరైన ఆహారం, సరైన నిద్ర తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆరోగ్యమే- మహాభాగ్యం అనే నినాదంతోప్రజారోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె.రాణి, డిపిహెచ్‌యన్‌ఒ వి.శాంతి, డెమో వి.చిన్నతల్లి, ఎస్‌ఒ జి.గిరిగణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti