Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్కార్‌ బరిలో సూర్య సినిమా

ఆస్కార్‌ బరిలో సూర్య సినిమా

న్యూఢిల్లీ : సూర్య , అపర్ణా మురళీ హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా 'సూరారై పొట్రు' (ఆకాశం నీ హద్దురా !) ఆస్కార్‌ బరిలోకి వెళ్లింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడితో పాటు మరికొన్ని కేటగిరీల్లో ఆస్కార్‌ రేసుకు ఎంపికైంది. విమానయాన సంస్థ 'ఎయిర్‌ డెక్కన్‌'ను స్థాపించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సినిమా ఆస్కార్‌ రేసులోకి ప్రవేశించిందంటూ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు తెలుపుతూ... తమ సినిమా 'సూరారై పొట్రు' ఆస్కార్‌ రేసుకి ఎంపికైందంటూ ఈ చిత్ర సహనిర్మాత రాజ్‌సేకర్‌ పాండియన్‌ ట్వీట్‌ చేశారు. గతేడాది అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో (ఒటిటి)లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన సినిమాలను కూడా ఆస్కార్‌ నామినేషన్‌లకు అనుమతిస్తున్నట్లు కమిటీ వెల్లడించింది. ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో 'గోల్డెన్‌ గ్లోబ్స్‌ అవార్డ్స్‌ 2021'లో ప్రదర్శించబడే 10 భారతీయ చిత్రాల్లో కూడా 'సూరారై పొట్రూ' ఎంపికవడం గమనార్హం. కాగా, మలయాళం మూవీ 'జల్లికట్టు ' కూడా ఆస్కార్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti