ప్రజాశక్తి - చిప్పగిరి: మహిళలందరూ కూడా తమ ఎన్నుకున్న రంగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే తప్పనిసరిగా విజయం సాధిస్తారని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి గీతా వాణి తెలిపారు.
మంగళవారం మండల కేంద్రమైన చిప్పగిరిలో భోగేశ్వర దేవాలయం దగ్గర కిషోరీ వికాసం, కిషోరీ బాల బాలికల సాధికారత మనందరి బాధ్యత అనే కార్యక్రమం పై వేసవికాలం సెలవు రోజులలో కిషోరి బాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిశోరి బాలికలు అందరూ కూడా తమ స్వీయ నియంత్రణ తో ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ వేసవి కాలంలో ప్రభుత్వం కిషోరీ బాలికలకు జీవన నైపుణ్యాలు లో పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వేసవికాలం అంతా కూడా కిషోరీ బాలికలు అవగాహన పెంచుకోవాలని మహిళలకు సూచించారు. ముందుగా బాలికలందరూ కూడా తమను తాము తెలుసుకోవాలని, అప్పుడే వారి ఆత్మవిశ్వాసం పై కూడా నమ్మకం ఏర్పడుతుందన్నారు. పంచాయతీ కార్యదర్శి హరిబాబు,మహిళా పోలీస్ గౌరేస్వరి, వెల్ఫేర్ అసిస్టెంట్ సాయి అపర్ణ అంగన్వాడి టీచర్లు హరిత, పద్మ, రామ తులసి, పుల్లమ్మ పాల్గొన్నారు.

