Friday, 18 Oct, 11.17 pm ప్రజాశక్తి

తాజావార్తలు
అచ్చులో చూసుకోవాలని...

ఇటీవల సాహిత్య సభలు అనేక ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. గతంలో కంటే ఇవి ఎంతో అభివృద్ధి దిశగా జరుగుతున్నాయి. సీనియర్‌ కవులు, జూనియర్‌ కవులు, తమ కవిత్వ రచనలను, కథా రచనలను, సంపుటాలను, ఆవిష్కరణలను విరివిగా చేస్తున్నారు. కానీ ఆర్థిక శక్తి లేని కొంతమంది కవులు తమ కవితలను, కథలను వెలుగులోకి తీసుకురాలేక, చందాలు అడిగి పుస్తకాలు అచ్చు వేయడానికి ఎంతో మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు గురవుతున్నారు. ఇటువంటి వారి కవితలు, కథలు పరిశీలన చేసి కనీసం నెలకొక, ఆయా కవి/రచయిత పుస్తకాలను సాహిత్యసభల ద్వారా వెలుగులోకి తీసుకురావాలి. అలాగే ప్రచురణ అయిన పుస్తకాలను నామమాత్రపు ధరలకే అందుబాటులోకి తేవాలి. అప్పుడే ఉచితంగా పంచే ఆనవాయితీ తగ్గుముఖం పడుతుంది. అంతేకాక కాలేజీ విద్యార్థులకు, లైబ్రరీలకు ఈ పుస్తకాలను రాయితీలతో అందిస్తే చదువుతో పాటు విద్యార్థుల్లో సాహిత్య అభిలాష పెరుగుతుంది.

- జె సుధాకర్‌ పట్నాయక్‌, కాకినాడ.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top