ముఖ్యాంశాలు
అధ్యక్షుడిగా ట్రంప్ చెప్పిన అబద్దాలు 33,573, రేపు సెనెట్‌లో అభిశంసన తీర్మానం

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగా చెప్పిన అబద్దాలు, అర్ధ సత్యాలు, తప్పుతోవ పట్టించే వ్యాఖ్యాలు ఎన్నో తెలుసా..అక్షరాల 33,573. ఒక అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఇన్ని అబద్దాలు చెప్పారా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. కానీ అమెరికాలో ఫ్యాక్ట్ చెకర్ అనే సంస్థ మాత్రం నిజమేనంటుంది. గత పదేళ్లుగా అమెరికా అధ్యక్షుల వ్యాఖ్యానాలు, ప్రకటనలను పరిశీలిస్తున్న ఈ సంస్థ నాలుగేళ్ల అధికారంలో ట్రంప్ ఎన్ని అబద్దాలు చెప్పారు అనేది కూడా లెక్కేసింది. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం జరిగిన నాటి నుండే ట్రంప్ అబద్దాలు, తప్పుడు వ్యాఖ్యాలు చేయడం మొదలు పెట్టారు. మొదటిరోజే 10 అబద్దాలు చెప్పారు. రెండో రోజు ఐదు అబద్దాలు చెప్పారు.
ఇక అవి కొనసాగతూ వెళ్లాయి. కరోనా వ్యాధి ఓ అద్బుతం లాగా కనుమరుగైపోతుందని, అమెరికా అధ్యక్ష ఎన్నికలను దొంగలించారని ఇలా ఎప్పుడూ ఆయన అబద్దాలే చెప్పారు. దీంతో క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడి జరిపి ఐదుగురు మృతికి కారణమయ్యారు. దీంతో ట్రంప్ అభిశంసనను ఎదుర్కొన్నారు. ఆయన చెప్పిన మొత్తం 33,573 అబద్దాల్లో సగానికిపైగా అబద్దాలు చివరి సంవత్సరంలోనే చెప్పారు. అధ్యక్షుడిగా మొదటి సంవత్సరంలో రోజుకు సగటున ఆరు అబద్దాలు చెప్పారు. రెండో ఏడాదిలో రోజుకు 16, మూడో ఏడాదిలో 22, చివరి ఏడాదిలో రోజుకు 39 అబద్దాలు చెప్పారు. మొదటి పదివేల అబద్దాలు 27 నెలల్లో చెప్పగా...20 వేల అబద్దాలకు చేరుకోవడానికి మరో 14 నెలల సమయం పట్టింది. 30 వేల అబద్దాలకు చేరుకోవడానికి కేవలం ఐదు నెలల సమయం మాత్రమే పట్టింది. ఈ కారణంగానే చివరికి ట్రంప్ అభిశంసనకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆయన్ను రెండోసారి అభిశంసిస్తూ తీర్మానించింది. సోమవారం సెనెట్‌లోనూ అభిశంసన తీర్మానం పెట్టబోతున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఈ తీర్మానంపై సెనెట్‌లో చర్చ జరగనుంది.
related stories
-
అంతర్జాతీయం అమెరికాలో కీలక పదవి దక్కించుకున్న భారత సంతతి మహిళల
-
అంతర్జాతీయం అమెరికా ప్రజాజీవనాన్ని గాడిన పెట్టేందుకు జో బైడెన్ కొత్త ప్రతిపాదన
-
ఎన్ ఆర్ ఐ బిడెన్ ఆలోచన మారిపోయిందే...?