Sunday, 11 Apr, 12.14 pm ప్రజాశక్తి

ముఖ్యాంశాలు
ఐదోవిడత ఎన్నికల ప్రచార సమయం తగ్గింపు.. ఈసి ఆదేశం..

ఢిల్లీ: బెంగాల్లోని కోచ్‌బిహార్‌ జిల్లాలో ఉధృత పరిస్థితుల నేపథ్యంలో.. ఐదోవిడత ఎన్నికలకు మూడు రోజులు ముందు నుండే ఆ జిల్లా సరిహద్దుల వద్ద నేతలు ఎలాంటి పర్యటనలు చేయొద్దంటూ ఈసి ఆదేశించింది. ఇక్కడ నాల్గో విడత ఎన్నికల సందర్భంగా కేంద్రబలగాల కాల్పుల్లో నలుగురు మరణించిన విషయం విధితమే. మరోవైపు ఈనెల 17న ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ రాజకీయ నేతల ప్రచార సమయాన్ని ఈసి తగ్గించింది. పోలింగ్‌కు 72గంటల ముందే ప్రచారం ఆపేయాలని నిర్ణయించింది. కోచ్‌బిహార్‌లో ఘటనాస్థలాన్ని ముఖ్యమంత్రి మమత ఆదివారం పర్యటించనున్నారు. మరోవైపు ఈసి అదనపు కేంద్రబలగాలను బెంగాల్‌కు పంపింది. మిగిలిన నాల్గువిడత ఎన్నికల వరకూ వీరు అక్కడే ఉండనున్నారు. కాగా, కేంద్ర బలగాల కాల్పులకు నిరసనగా తృణముల్‌ కాంగ్రెస్‌... బెంగాల్‌ వ్యాప్తంగా బ్లాక్‌డే పాటిస్తోంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top