ఐక్యరాజ్య సమితి : వచ్చే వారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించనున్నారు.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
మోడీ, బైడెన్‌లతో పాటుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిడె సుగాలు కూడా ఈ సమావేశంలో పాల్గొని గత ఆరుమాసాల్లో జరిగిన పురోగతిని సమీక్షిస్తారు. పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతీయ అంశాలను కూడా చర్చిస్తారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ''కోవిడ్ నుండి కోలుకుని పూర్వపు స్థితికి రావడం, సుస్థిరతను పునర్నిర్మించుకోవడం, ప్రపంచ అవసరాలకు తగిన రీతిలో స్పందించడం, ప్రజల హక్కులను గౌరవించడం, ఐక్యరాజ్య సమితిని పరిపుష్టం చేయడం'' ప్రధాన అంశాలుగా జనరల్ అసెంబ్లీలో చర్చ జరగనుంది. 109మంది నేతలు జనరల్ అసెంబ్లీలో మాట్లాడతారు. దాదాపు 60మంది తమ ప్రసంగాలను రికార్డు చేసి పంపుతారు. బ్రెజిల్ నేత మొదటగా ప్రసంగించనుండగా, అమెరికా ఆ తరువాత, చివరిగా ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి ప్రసంగించనున్నారు.

