ఈ కాలంలో చల్లని పానీయాలు తాగేటప్పుడు ఐస్ తప్పనిసరి. అయితే, కొన్నిసార్లు ఫ్రీజర్‌లో తయారయ్యే ఐస్‌కు ఒకలాంటి వాసన రావడం వల్ల పానీయాల రుచి చెడిపోతుంది.
ఫ్రీజర్‌లో గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, తెరిచి ఉంచిన ఆహారం నుంచి వచ్చే వాసనలు ఐస్‌లోకి చేరడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా చేపలు, ఉల్లిపాయలు వంటి ఘాటైన వాసన కలిగిన పదార్థాలను సరిగ్గా కవర్ చేయకుండా ఉంచితే, వాటి వాసన ఐస్ క్యూబ్స్‌లోకి చేరిపోతుంది.
నివారణ ఇలా …
- ఫ్రీజర్‌లో ఉన్న ఆహారాన్ని సరిగా ప్యాక్ చేయాలి. గాలి చొరబడని డబ్బాలు లేదా కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయాలి. ఐస్ ట్రేలను కూడా మూత ఉన్న డబ్బాల్లో లేదా సీల్డ్ బ్యాగ్‌లలో ఉంచడం వల్ల బయటి వాసనలు ఐస్‌పై పడకుండా ఉంటుంది.
- ఫ్రీజర్‌లో ఒక మూలలో మూతలేని పాత్రలో బేకింగ్ సోడా ఉంచితే, అది గాలిలోని చెడు వాసనలను పీల్చుకుని ఫ్రీజర్‌ను తాజాగా ఉంచుతుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి బేకింగ్ సోడాను మార్చాలి.
- ఐస్‌ను క్రమం తప్పకుండా మార్చాలి. చాలా రోజుల పాటు నిల్వ ఉంచిన ఐస్ తేమను, వాసనలను పీల్చుకుని రుచి కోల్పోతుంది. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఐస్ ట్రేను ఖాళీ చేసి, గోరువెచ్చని నీరు, సబ్బుతో శుభ్రం చేసి మళ్లీ కొత్త ఐస్ తయారు చేసుకోవాలి.

