Tuesday, 22 Oct, 12.30 am ప్రజాశక్తి

తాజావార్తలు
ఐటి దాడులుపై స్పందించిన సునీల్‌ దాసాజి

ప్రజాశక్తి- వరదయ్యపాలెం(చిత్తూరు):
చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలో గత నాలుగు రోజులుగా కల్కి ఆశ్రమంపై జరుగుతున్న ఐటి దాడులపై ఆశ్రమ ప్రతినిధి సునీల్‌ దాసాజి సోమవారం మీడియాతో మాట్లాడారు. దేశంలోని సంస్థలు, వ్యవస్థల విధివిధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఐటి అధికారులు దాడులు నిర్వహించడం సాధారణమని అందులో భాగంగానే ఆశ్రమంపైన ఐటి దాడులు జరిగాయన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, అధికారులకు పూర్తిగా సహకరించామని తెలిపారు. ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో వస్తున్న కథనాలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. అపోహలు నమ్మోదంటూ ప్రజలను, భక్తులను కోరారు. భగవాన్‌ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. 27 నుంచి ఆశ్రమంలో యధావిధిగా కార్యకలాపాలు జరుగుతాయన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top