Dailyhunt
అమెరికా బెదిరింపులపై ఫ్రాన్స్‌, ఇయు ఉమ్మడి పోరు

అమెరికా బెదిరింపులపై ఫ్రాన్స్‌, ఇయు ఉమ్మడి పోరు

* ఫ్రెంచ్‌ మంత్రుల వెల్లడి
పారిస్‌: ఫ్రెంచ్‌ ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచుతామంటూ అమెరికా తరచు చేస్తున్న బెదిరింపులపై ఉమ్మడి పోరుకు ఫ్రాన్స్‌, ఐరోపా కూటమి సిద్ధంగా వున్నాయని ఫ్రెంచ్‌ మంత్రులు ప్రకటించారు. ఫ్రాన్స్‌ నుండి దిగుమతి అయ్యే షాంపేన్‌ వంటి దాదాపు 240 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తానంటూ అమెరికా సోమవారం చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించిన మంత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మారీ మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమెరికా ప్రతిపాదనలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అమెరికా తాజాగా ఆంక్షలు విధిస్తే వాటిని తిప్పికొట్టేందుకు ఫ్రాన్స్‌తో పాటు ఐరోపా కూటమి కూడా సిద్ధంగా వుందని ఆయన అన్నారు.

ఆర్థిక శాఖ ఉపమంత్రి పన్నీర్‌ రునాచర్‌ మాట్లాడుతూ ఈ విషయంలో అమెరికాతో వ్యవహరించే అంశంపై ఫ్రాన్స్‌ పోరాడుతూనే వుంటుందని, డిజిటల్‌ టాక్స్‌ ప్రతిపాదనలను ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti