- 300 రోజులుగా మోహరింపు
- ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకగా రికార్డు
వాషింగ్టన్ : ప్రపంచంలోనే అతి పెద్ద యుద్ద నౌక అయిన యుఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ 300 రోజుల అనంతరం అమెరికాకు తిరిగి చేరుకోనుంది.
రికార్డు స్థాయి మోహరింపు తర్వాత యూఎసఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ పశ్చిమాసియా నుంచి వెనక్కి రానున్నది. ఈ యుద్ధ నౌకను వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవటానికి అమెరికా సైన్యం వినియోగించింది. అనంతరం ఇరాన్‌పై సంబంధించిన యుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించింది. అయితే ఆ యుద్ధనౌకపై క్షిపణులతో విరుచుకుపడటంతో దెబ్బతిన్న విషయం విదితమే. అమెరికా సైన్యం ఆత్మస్థైర్యాన్ని ఇరాన్ దెబ్బ కోట్టడంతో ట్రంప్ బృందం తట్టుకోలేకపోతోంది. మరోవైపు గెరాల్డ్ యుద్ధనౌకలో ఉన్న సిబ్బందికి కలిగిన అవస్థలు, వారిపై పెరుగుత్ను ఒత్తిడి కారణంగా తిరిగి అమెరికాకు చేరుకోనున్నది. 300 రోజులకు పైగా సాగిన రికార్డు స్థాయి మోహరింపు తర్వాత స్వదేశానికి బయలుదేరనుందని ఇద్దరు అమెరికా అధికారులు తెలిపారు. గత వారం యూఎసఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ ఈ ప్రాంతానికి రాకతో, ఇరాన్ యుద్ధంలో బలహీనమైన కాల్పుల విరమణ సమయంలో పశ్చిమాసియాలో మూడు అమెరికన్ విమాన వాహక నౌకలు మోహరించాయి . 2003 తర్వాత ఇంత సంఖ్యలో మోహరించడం ఇదే మొదటిసారి. టెహ్రాన్‌తో ఉద్రిక్తతలు పెరగడంతో యూఎసఎస్ అబ్రహం లింకన్ కూడా జనవరి నుంచి ఈ
ప్రాంతంలోనే ఉంది. అయితే ఈ యుద్ధనౌకపై కూడా ఇరాన్ క్షిపణి దాడులతో అమెరికా సైన్యానికి దడపుట్టించింది.

