పోతనంటివి, చూసివస్తనంటివి అమెరిక, కొడుకా వీపు మీద గుర్రం ఆట ఆడినావు, అమెరిక కొడుకా!
రెక్కలు తెంచి రెక్కల గుర్రం ఎక్కి ఎగిరిపోతివా అమెరికా
నన్ను ఒంటరి దానిని చేసి వెళ్లిపోయావా అమెరిక, కొడుకా!
గొప్పలు సెప్పుకొంటిని నా కొడుకు అమెరికా పోయిండని
డబ్బు మాయలోపడి నన్ను మర్చిపోయావా, అమెరిక కొడుకా !
బతికుండగానే సంపకురా, కాటికి కాలుచాపిన
అమ్మను జీవచ్ఛ శవం చేయబోకురా అమెరిక కొడుకా!
నీవు వస్తావని, పానాన్ని బిగపట్టి ఎదురు చూస్తున్నాను
నిన్ను చూసి తనువు చాలిస్తామనుకున్నాను అమెరిక కొడుకా!
ఎప్పుడు వస్తావని అడిగితే ఇదిగో అదిగో వస్తనంటివి కానీ
రాలేదు
ఈ కట్టే కాలిమెరికవాత కూడా నీ కోసం ఎదురు చూస్తాను, అమెరిక కొడుకా!
మంచానపడ్డాను అంటే సావలేదుగా అన్నావు
వస్తే నౌకరి పోతదన్నావు, నౌకరి ముఖ్యమన్నావు, అమెరిక కొడుకా!
నన్ను దవాఖాన తీసుకెళ్లే చుట్టమైన లేకపోయే
చద్దామంటే సావు రాకపోయే అమెరిక కొడుకా!
పాణం తీసుకుందామoటే కడసారి చూడలేవని బాధ
ఓ తారక ఇక సెలవు మీ అమ్మకు ఓ అమెరిక కొడుకా!
- బండ్ల తారకేష్ ,
6369377140

