Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కోచ్‌ సబెల్లా మృతి

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కోచ్‌ సబెల్లా మృతి

బ్యూనస్‌ఎయిర్స్‌ : అర్జెంటీనా పుట్‌బాల్‌ జట్టు మాజీ కోచ్‌ సబెల్లా (66) మంగళవారం మరణించారు. రెండు వారాలుగా క్యాన్సర్‌, గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 2014 ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన అర్జెంటీనా జట్టుకు కోచ్‌గా సబెల్లా ఉన్నారు. ఇటీవల మృతిచెందిన డిగో మారడోనాతో కలిసి సబెల్లా 1980 లో అర్జెంటీనా తరఫున ఫిఫా ప్రపంచకప్‌ ఆడారు. దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు మారడోనా మృతితో శోకసంద్రంలో తమ జట్టుకు మాజీ కోచ్‌ మృతి మరో ఎదురుదెబ్బలాంటిదని సహచర ఆటగాడు, మాజీ గోల్‌కీపర్‌ ఉబాల్డో ఫిలోల్‌ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti