Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగారం భగభగ

బంగారం భగభగ

న్యూఢిల్లీ : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.1,63,600కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.47 శాతం తగ్గి ఔన్స్‌కు 4,544.78 డాలర్ల వద్ద ట్రేడయింది. మరోవైపు పారిశ్రామిక డిమాండ్ క్షీణించడంతో వెండి ధర కిలోకు ఏకంగా రూ.5,000 పడిపోయి రూ.2,71,000 వద్ద నమోదయ్యింది. అంతర్జాతీయంగా వెండి 2.01 శాతం తగ్గి ఔన్స్‌కు 76.12 డాలర్లకు పరిమితమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti