Dailyhunt
బెంగాల్‌కు పరిశీలకుడిగా అమిత్ షా.. అస్సాంకు జెపి నడ్డాను నియమించిన బిజెపి

బెంగాల్‌కు పరిశీలకుడిగా అమిత్ షా.. అస్సాంకు జెపి నడ్డాను నియమించిన బిజెపి

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో బిజెపి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కేంద్ర పరిశీలకుడుగా బెంగాల్ కు అమిత్ షాను, సహ పరిశీలకుడిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని బిజెపి అధిష్టానం నియమించింది.

అలాగే అస్సాంకు జెపి నడ్డాను, సహ పరిశీలకుడిగా హర్యానా సిఎం నయాబ్ సింగ్ సైని నియమించింది. బెంగాల్లో బిజెపి ఎమ్మెల్యేలు, అగ్రనేతలు అమిత్ షాను, మోహన్ చరణ్ తో సమావేశమై.. శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే సిఎం రేసులో సువేందు అధికారి ఉన్నారు.

బెంగాల్ సిఎం మమతా బెనర్జీని రెండుసార్లు ఓడించిన రికార్డు ఆయనది. బహుశా బిజెపి ఆయనకే సిఎం పదవి కట్టబెట్టనున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక అస్సాంలో నడ్డాతో, సహపరిశీలకుడిగా నయాబ్ సింగ్ సై ప్రభుత్వ ఏర్పాటును పర్యవేక్షిస్తారు. ఇప్పటికే సిఎం పదవిలో ఉన్న హిమంతబిశ్వ శర్మ బహుశా అదే పదవిలో కొనసాగే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti