Wednesday, 23 Dec, 10.08 pm ప్రజాశక్తి

క్రీడలు
భారత మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు మీర్‌ సజ్జాద్‌ అలీ కన్నుమూత

హైదరాబాద్‌ : భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ ఆటగాడు మీర్‌ సజ్జాద్‌ అలీ(66) బుధవారం కన్నుమూశారు. అలీకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. ఆసిఫ్‌ నగర్‌లోని జెబాబాగ్‌ ఉంటున్న సజ్జాద్‌ అలీ కెరీర్‌ ప్రారంభంలో స్థానిక లీగ్‌లో బీడీఎల్‌ తరఫున ఆడాడు. లెఫ్ట్‌ వింగర్‌గా తన అద్భుత ఆటతీరుతో బాగా ప్రాచుర్యం పొందారు. 1977లో భారత ఫుట్‌బాల్‌ జట్టు తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. అనంతరం తూర్పు బెంగాల్‌లోని మహ్మడన్‌ స్పోర్టింగ్‌, ఈస్ట్‌బెంగాల్‌ క్లబ్‌ల తరపున ఆడారు. సజ్జాద్‌ అలీ మృతికి ఇండియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో సంతాపాన్ని తెలియజేసింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top