కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), బిజెపిల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు.
నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న భబానీపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆమె నామినేషన్ వేయడానికి ముందు భారీ ర్యాలీగా పాదయాత్రను ప్రారంభించారు.

