Dailyhunt
బి సి ఈ ఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

బి సి ఈ ఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రజాశక్తి-కలికిరి (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టా భాస్కర్ పర్యవేక్షణ లో కలికిరిలో నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. జిల్లా అధ్యక్షులుగా ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి గా మల్లికార్జున, ఆర్థిక కార్యదర్శి గా చంద్రశేఖర్ లు, జిల్లా కార్యదర్శి గా శ్రీనివాసులును, రాష్ట్ర కార్యదర్శి గా చంద్రశేఖర్ లను బీసీ ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బిసి ఈ ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ …. బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం, ఓబిసీ క్రిమీలేయర్ సర్టిఫికెట్ లు పొందడంలో ఎదురౌతున్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని సత్వరమే పరిష్కరించగలమని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్, హరినారాయణ, హరికృష్ణ, శ్రీనివాసులు, మల్లేశ్వర, నీలకంఠ, కుమార్ యాదవ్, విజయ్, గంగరాజు, రామయ్య, గురుమూర్తీ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti