Dailyhunt
బొలీవియాలో సీనియర్ జడ్జిపై కాల్పులు

బొలీవియాలో సీనియర్ జడ్జిపై కాల్పులు

లాపాజ్ : బొలీవియాలో అత్యున్నత జడ్జి జస్టిస్ విక్టర్ హ్యూగో క్లారేని దుండగులు కాల్చి చంపారు. బొలీవియా తూర్పునగరమైన శాంటా క్రూజ్ లో టాక్సీలో ప్రయాణిస్తున్న ఆయనను దుండగులు కాల్చి చంపారని పోలీసులు శుక్రవారం తెలిపారు.

దేశంలోనే అత్యున్నత వ్యవసాయ-పర్యావరణ కోర్టులో ఆయన సీనియర్ జడ్జిగా ఉన్నారు. గురువారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగిందని, దర్యాప్తు కొనసాగుతోందని శాంటా క్రూజ్ పోలీస్ కమాండర్ మీడియాకు తెలిపారు. మోటర్ బైక్ పై వస్తున్న ఇద్దరు దుండగుల్లో ఒకరు జడ్జిపై కాల్పులు జరిపారని అన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మరణించారని, ఆయన శరీరంపై నాలుగు బుల్లెట్ గాయాలున్నాయిని అన్నారు.

భూ వివాదం కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఆయన తెలిపారు. జస్టిస్ క్లారే సహా ఉన్నత స్థాయి న్యాయాధికారులు గురువారం శాంటాక్రూజ్ లో సమావేశమయ్యారని అన్నారు. ఈ దాడిని బొలీవియా అధ్యక్షుడు రోడ్రిగో పాజ్ ఖండించారు. కార్లే కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సైతం ఈ దాడిని ఖండించింది. తక్షణ, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti