తాజావార్తలు
బొలీవియాలో తెరపైకి వస్తున్న నియంతృత్వం

* పెరుగుతున్న అణచివేతపై మొరేల్స్ ఆవేదన
మెక్సికో: బొలీవియాలో కొనసాగుతున్న నిరసనలపై క్రమంగా పెరుగుతున్న అణచివేత చర్యలు ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు అద్దం పడుతున్నాయని మాజీ అధ్యక్షుడు ఎవో మొరేల్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశంలో అధికార పగ్గాలు చేపట్టిన డిఫ్యాక్టో ప్రభుత్వం నియంత ప్రభుత్వంగా మారుతోందని ఆయన సోమవారం ఒక ట్వీట్లో విమర్శించారు. నిరసనలను అడ్డుకోవటంలో భాగంగా 24 మందిని పొట్టన పెట్టుకున్న అక్కడి ప్రభుత్వం అణచివేతను అధికారిక విధానంగా తెరపైకి తెస్తోందని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించటానికి బదులు వారు నియంతృత్వ ప్రభుత్వాన్ని నెలకొల్పుతున్నారనేందుకు ఇది నిలువెత్తు ఉదాహరణ అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
తమ దేశంలోని డిఫ్యాక్టో ప్రభుత్వాం ప్రజలను శాంతింప చేయటానికి బదులుగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటున్న వారిపై అణచివేత, పరువు నష్టం దావాలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తోందని ఆయన వెల్లడించారు.
related stories
-
తాజావార్తలు ప్రతిపక్షాల కుట్రలు
-
తాజావార్తలు బొలీవియాలో ముదురుతున్న సంక్షోభం
-
తాజావార్తలు లాటిన్ అమెరికాలో జోక్యం కొనసాగిస్తాం..!