* మూడు పార్టీలు-మూడు ధోరణులు
లండన్ : బ్రిటిష్ రాజకీయాలు బ్రెగ్జిట్ చుట్టూ తిరుగుతున్నాయి. వచ్చే నెలలో జరిగే బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బ్రెగ్జిట్ ప్రతిష్టంభనపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. బ్రిటిష్ పారిశ్రామిక సమాఖ్య వార్షిక సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చా వేదికలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ప్రసంగిస్తూ, విభిన్న వాదనలు వినిపించారు. బ్రిటన్ ప్రధాని, కన్సర్వేటివ్ పార్టీ నేత బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ,' దేశాన్ని ముందుకు సాగనీయకుండా రాజకీయాలు, పార్లమెంటు వెనక్కి లాగుతున్నాయి. ఈ అనిశ్చితికి తెర దించాల్సిన సమయం ఆసన్నమైంది' అని చెప్పారు.
లిబరల్ డెమొక్రాట్స్ నాయకురాలు స్విన్సన్ మాట్లా డుతూ, తాము అధికారంలోకి వస్తే బ్రెగ్జిట్‌ను రద్దు చేసి, యూరోపియన్ యూనియన్‌లోనే బ్రిటన్ కొనసాగేలా చూస్తామన్నారు. బ్రెగ్జిట్ అది ఏ రూపంలో ఉన్నా బ్రిటన్‌కు నష్టదాయకమే నన్నారు. బ్రెగ్జిట్ వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు తెబ్బతినే ప్రమాదముందని లిబరల్ డెమొక్రాట్స్ నేత అభి ప్రాయపడ్డారు. బ్రిటిష్ పారిశ్రామిక సమాఖ్య ప్రతినిధి ఒకరు మాట్లా డుతూ, ఇయుతో ఏర్పర చుకునే నూతన సంబం ధాలు వాణిజ్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగేలా, సేవల రంగానికి మద్దతు నిచ్చేలా ఉండాలి. దీనిపై తగు నియంత్రణ కూడా ఉండాలని పారిశ్రామిక సమాఖ్య ప్రతినిధి పేర్కొన్నారు. ఎవరు గెలుస్తారనేది తమకు అంత ముఖ్యం కాదని, మన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడమే ప్రధానమని ఆయన అన్నారు. బ్రిటన్ వాణిజ్యంలో సగం దాకా యూరోపియన్ యూనియన్‌తో ముడిపడే కొనసాగుతోందన్నారు. ఇయు వాణిజ్యంలో ఇది 13 శాతం దాకా ఉంటుందన్నారు. నో డీల్ బ్రెగ్జిట్ దేశానికి మంచిది కాదన్నారు.

