Tuesday, 22 Oct, 12.35 am ప్రజాశక్తి

తాజావార్తలు
బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు రైతు సంఘం మద్దతు

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ (గుంటూరు జిల్లా):
బ్యాంకులను విలీనం చేస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్రకమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.కేశవరావు, పూల పెద్దిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పాలనే కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగమే బ్యాంకుల విలీనమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, వ్యవసాయ కార్మికులకు, చేతివృత్తులవారికి ప్రధానంగా కౌలు రైతులకు రుణాలు తగ్గుతాయని, వారు పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మీదే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇది రైతు, కౌలురైతుల ఆత్మహత్యాలకు దారితీస్తుందని ఆందోళన వెలిబుచ్చారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top