Saturday, 21 Sep, 1.44 pm ప్రజాశక్తి

తాజావార్తలు
బ్యాట్స్‌మెన్‌ వేడుకల్ని చెడగొట్టడమే మా పని : స్పిన్నర్‌ శంసీ

బెంగళూరు: టీ20 క్రికెట్‌ బ్యాట్స్‌మెన్‌ ఆట. ఇక్కడ వారి వేడుకల్ని చెడగొట్టడమే బౌలర్ల పని, అది చూడటానికే అభిమానులు స్టేడియానికి వస్తారని దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ తబ్రైజ్‌ శంసీ పేర్కొన్నాడు. బుధవారం జరిగిన రెండో టీ20లో మంచి బౌలింగ్‌ చేసిన తబ్రైజ్‌ మూడు ఓవర్లలో ఒక వికెట్‌ తీసి 19 పరుగులు ఇచ్చాడు. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం బెంగళూరు చేరుకున్న అతడు తన సొంత మైదానానికి వచ్చినట్లు భావిస్తున్నాడు. తబ్రైజ్‌ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కోహ్లీ సారథ్యంలో ఆడుతున్నాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంపై అతడికి మంచి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో మూడో టీ20లో మంచి బౌలింగ్‌ చేసి టీమిండియాని కట్టడి చేయాలని చూస్తున్నాడు.చిన్నస్వామి స్టేడియం చాలా చిన్నది. ఇది టీ20 సిరీస్‌ కాబట్టి బ్యాట్స్‌మెన్‌ బాదే ఫోర్లు, సిక్సులు చూడటానికే ప్రేక్షకులు వస్తారు. బౌలర్లు ఇక్కడ మెయిడిన్‌ ఓవర్లు వేస్తే వారు రారు. ఐపీఎల్‌లో కోహ్లీ, క్రిస్‌గేల్‌ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడటం మంచి క్రికెటర్‌గా ఎదిగేందుకు తోడ్పడింది అని తబ్రైజ్‌ చెప్పుకొచ్చాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti

related stories

Top