ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి- కరప 'మండలంలోని వేములవాడలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.' పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని వేములవాడకు చెందిన పాట్నీడి కృష్ణ భగవాన్ (32), బొండా సాయిమధు (15), రౌతు సురేష్, అప్పనపల్లి సాయి శివరాం, కోట శ్రీను స్నేహితులు. బుధవారం అర్థరాత్రి జరిగిన వివాహ వేడుకల్లో వీరంతా పాల్గొన్నారు. అనంతరం విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కోట శ్రీనును కాకినాడ ఆర్‌టిసి బస్టాండ్ వద్ద దింపేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వేములవాడ సమీపంలోకొచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారు గోతిలో పడింది.

