Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దాడుల నుంచి రక్షణ కల్పించాలని నిరసన

దాడుల నుంచి రక్షణ కల్పించాలని నిరసన

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: వైద్యులపై దాడుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం రిమ్స్‌ మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ఐఎంఎ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి పిజె.నాయుడు, కె.వినోద్‌కుమార్‌ ఆధ్వర్యాన వైద్యులు శుక్రవారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ రోగులకు సేవలందించడంలో రెయింబవళ్లు శ్రమిస్తున్నా తరచూ దేశంలో ఏదో ఒక చోట వైద్యులపై దాడులు జరుగుతున్నాయని, వైద్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీరికి ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా కార్యదర్శి జి.సతీష్‌ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు గొలివి మోహన్‌, భాస్కరరావు, సత్యానంద్‌, ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీనివాస్‌, సభ్యులు వి.కళ్యాణ్‌, రాజు, టి.రాము, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు విజికె.మూర్తి, జన విజ్ఞాన వేదిక సభ్యులు వి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి వినతిపత్రం అందజేత
పలాస:
ఐఎంఎ ఆధ్వర్యాన వైద్యులు జంట పట్టణాల్లో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి అప్పలరాజును కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఐఎంఎ పలాస మండల అధ్యక్షులు మల్లేశ్వరరావు, కోశాధికారి ఎస్‌.విజయకుమార్‌, కణితి కేశవరావు, వైద్యులు బాలకృష్ణ, హేమచంద్రరావు, కె.మోహనరావు, తదితరులు ఉన్నారు.
ఇచ్ఛాపురం: పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రి వద్ద నిరసన తెలిపారు. వైద్యులపై దాడులు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డాక్టరు పాపినాయుడు, శ్రీనివాస్‌, శేషగిరి, స్వాతి, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti