ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ ఉదారతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. వారి సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రతి నెల నాలుగో శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్‌లో జిందాల్ చెత్త నిర్వహణ ప్లాంటు సంస్థ మంజూరు చేసిన సిఎస్‌ఆర్ నిధులతో కొనుగోలు చేసిన 13 ట్రై సైకిళ్లను దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …. ట్రై సైకిళ్లు దివ్యాంగుల స్వావలంబనకు తోడ్పడతాయని అన్నారు. దివ్యాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సంస్థ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

