ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : చైన్ స్నాచ్ దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం నార్పలలో జరిగింది. మండల కేంద్రమైన నార్పల సుల్తాన్ పేటలో ఎంపీడీవో కార్యాలయ సమీపంలో నార్పల గుగూడు మెయిన్ రోడ్డు పై వెళుతున్న మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కొని వెళుతున్న దొంగను వెంటనే అక్కడ ఉన్న ప్రజలు పట్టుకున్నారు.
దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. దొంగది కళ్యాణ్ దుర్గం ప్రాంతమని తెలిసింది. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

