Dailyhunt
డ్రైవర్‌ కుటుంబానికి ఎమ్మెల్యే వంశీ సాయం

డ్రైవర్‌ కుటుంబానికి ఎమ్మెల్యే వంశీ సాయం

ప్రజాశక్తి-గన్నవరం : తనను నమ్ముకున్న వారికి ఆపద వస్తే ఆదుకోవడంలో,అండగా నిలవడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

తనవద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న పుట్టికోటేశ్వరరావుకు అనుకోని ఆపద వచ్చి పుట్టెడు దుఖంలో ఉండగా తానున్నానంటూ ఓదార్చి కొండంత అండగా నిలిచారు. ఉంగుటూరు మండలం గారపాడు గ్రామానికి చెందిన పుట్టి కోటేశ్వరరావు గత ఆరు సంవత్సరాలుగా ఎమ్మెల్యే వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం అతని భార్య పుట్టి సత్యవతి ఉయ్యూరు పట్టణంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి నందు మగబిడ్డకు జన్మనివ్వగా, ఆ బిడ్డ గుండె సంబంధిత అనారోగ్యంతో జన్మించాడని, వెంటనే విజయవాడలోని ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. ఏమీ పాలుపోని హదయవిధారక పరిస్తితులలో విలపిస్తూ శాసనసభ్యులు డా.

వంశీకి ఫోన్‌ చేయగా వెంటనే స్పందించిన ఆయన విజయవాడలోని రెయిన్‌ బో ఆసుపత్రి డాక్టర్లతో తాను మాట్లాడతానని, అధైర్యపడవద్దని సూచించారు. అనంతరం ఆ బిడ్డను విజయవాడ ఆసుపత్రికి తరలించగా వైద్య పరిక్షలు నిర్వహించిన డాక్టర్లు గుండె నిమిషానికి 20 సార్లు మాత్రమే కొట్టుకుంటుందని, కాలిలో నరాల సమస్య ఉన్నదని, వైద్యానికి లక్ష లాది రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. అదే విషయాన్ని మరొకసారి వంశీకి ఫోన్‌ చేసి తెలుపగా ఆయన వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్‌ చేసి ఖర్చు మొత్తం తానే భరిస్తానని, వెంటనే వైద్యం ప్రారంభించాలని కోరారు. అనంతరం బిడ్డకు వైద్యం కొనసాగుతుండగా తన తొలివిడత సాయంగా వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.7లక్షలు నగదును వైద్య సహాయంగా మంజూరుచేయించారు. శాసనసభ్యులు ఆదేశాల మేరకు బుధవారం ఆయనసతీమణి వల్లభనేని పంకజ స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి అక్కడి వైద్యులతో బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ఆ మంజూరు పత్రాన్ని ఆసుపత్రి యాజమాన్య బాధ్యులకు అందజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti